SRPT: రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత లేకుండా ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ అన్నారు. బ్లాక్ మార్కెట్లో యూరియాను అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇవాళ సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో సూర్యాపేట కొత్త బస్టాండ్ దగ్గర నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు.