ప్రకాశం: సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యమైనదని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. ఇందులో భాగంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా సి. ఎస్.పురం మండలం చింతలపూడి, నాగులవరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురుపూజోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.