MDK: శుక్రవారం రోజున పంచముఖ గణేశ్ మండపం వద్ద 9 రోజుల పాటు పూజలందుకున్న గణనాథుడి లడ్డూ వేలం పోటాపోటీగా సాగింది. ఈ వేలంలో స్థానికుడు వినోద్ అత్యధికంగా రూ. 89, 999కు లడ్డూను దక్కించుకున్నారు. నిర్వాహకులు లడ్డూను ఆయనకు అందజేసి శాలువాతో సత్కరించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ఆయన మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చక్రపాణి, సచిన్ పాల్గొన్నారు.