SRD: GST స్లాబ్ రేట్లు తగ్గించినందుకు బీజేపీ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ.. జీఎస్టీ రేట్లు తగ్గించినందుకు పేద ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు కసినివాసు, నాగరాజు, ద్వారకా రవి, మీనా గౌడ్ పాల్గొన్నారు.