NRPT: మిలాద్ ఉన్ నబీ, గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో బాంబ్ స్క్వాడ్, జాగిలాలతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆలయాలు, ప్రార్థన మందిరాలు, చౌరస్తాలు, బస్టాండ్, జనం రద్దీగా ఉండే ప్రదేశాల్లో తనిఖీలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రత చర్యలో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు పోలిసు అధికారులు పేర్కొన్నారు.