గద్వాల పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆలూరు బిలకంటి రాము రెండవసారి పట్టణ ఆర్య సంఘ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు మేడిశెట్టి బాలస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.