E.G: రాజమండ్రి రూరల్ మండలం ధవలేశ్వరంలోని గోదావరి నదికి అనుకుని ఉన్న గ్రామాల ప్రజలకు, వినాయక మండపాల కమిటీ సభ్యులకు సీఐ గణేష్ శుక్రవారం పలు సూచనలు, జాగ్రత్తలు తెలిపారు. డీజేలకు పర్మిషన్ లేదని తెలిపారు. టపాసులు కాల్చరాదనీ, మద్యం & మత్తు పానీయాలు వంటివి ఊరేగింపుకు నిషేదించాలన్నారు. ఊరేగింపు విధానాల గురించి పోలీసులతో కమిటీ సభ్యులు సహకరించాలన్నారు.