BHNG: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జరిగిన ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకల్లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కరరావు, డీఈవో సత్యనారాయణ, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు