ASR: డుంబ్రిగుడలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కేకు కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉపాధ్యాయుల సేవలను గుర్తిస్తూ వారికి సన్మానాలు చేశారు. ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.