AP: సీఎం చంద్రబాబు భద్రత కోసం కొత్త హెలికాప్టర్ కొన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఇది నిజం కాదంటూ ఎక్స్ వేదికగా ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. సీఎం పర్యటనల నిమిత్తం అద్దెకు తీసుకునే పాత హెలికాప్టర్ స్థానంలో వేరే అధునాతన మోడల్ హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకోనున్నారని తెలిపింది. ఈ కొత్త మోడల్ అద్దెకు తీసుకోవడం వల్ల భద్రత, సౌకర్యం మెరుగ్గా ఉంటాయని పేర్కొంది.