NLG: జిల్లాలోని వేములపల్లి వద్ద తండ్రి కొడుకులు గల్లంతైన దుర్ఘటన జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం వేములపల్లి వద్ద సాగర్ ఎడమ కాలువలో వినాయక నిమజ్జనానికి వెళ్లి తండ్రి కొడుకులు గల్లంతయ్యారు. స్థానికులు, పోలీసులు గాలింపును చేపట్టారు. ఈ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గల్లంతయిన వారి గురించి పూర్తి సమాచారం తెలియవలసి ఉంది.