ప్రకాశం: స్వచ్ఛ పాఠశాల అవార్డులకు రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని సీఎస్ పురం మండల విద్యాశాఖ అధికారి రాజాల కొండారెడ్డి ప్రధానోపాధ్యాయులందరికీ తెలియజేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పాఠశాల నమోదు కావాలని, ఈ నెల 15 లోగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం స్వచ్ఛ పాఠశాలలు, హరిత విద్యాలయాలు, పాఠశాలల అభివృద్ధే లక్ష్యంగా ఈ కార్యక్రమం అమలవుతుందని తెలిపారు.