BDK: బూర్గంపహాడ్ జర్నలిస్ట్ క్లబ్ దుర్గంపాడు వారి ఆధ్వర్యంలో జర్నలిస్ట్ డే కార్యక్రమం ఘనంగా శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు అబ్దుల్ గని, మాజీ జడ్పీటీసీ శ్రీమతి కామిరెడ్డి శ్రీలత పాల్గొన్నారు. ముందుగా క్లబ్ సభ్యులందరికీ జర్నలిస్ట్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సభ్యులందరికీ శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు.