NLG: రైతులు తాలు లేకుండా వడ్లను తూర్పార పట్టాలని నల్లగొండ కలెక్టర్ బీ.చంద్రశేఖర్ సూచించారు. ప్రతి ఒక్క రైతు తప్పకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమశాతం లేకుండా ఆరబెట్టుకోవాలన్నారు. నార్కెట్పల్లి లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు.