MNCL: నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్లో డీసీపీ భాస్కర్, ఏడీ సురేఖ, అధికారులతో కలిసి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నకిలీ పత్తి విత్తనాల వినియోగం వలన కలిగే నష్టాలను రైతులకు అవగాహన కల్పించి, నకిలీ విత్తనాలు సరఫరా చేసే దళారులు, విక్రయదారులపై చర్యలు తీసుకోవాలన్నారు.