MBNR: భూత్పూర్ నుంచి కర్నూల్ వైపు కోళ్ల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం గురువారం తెల్లవారుజామున ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తా సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ రంగస్వామి, క్లీనర్ మన్యం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రంగస్వామి చికిత్స నిమిత్తం 108లో కర్నూల్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.