HYD: ఆధ్యాత్మిక చింతనను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ అన్నారు. శనివారం శని త్రయోదశి సందర్భంగా తాడ్బండ్లోని హనుమాన్ దేవాలయాన్ని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.