ADB: ఆదిలాబాద్ డిపోకు చెందిన అన్ని రకాల ఆర్టీసీ బస్సులు ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో సీసీటీవీ కెమెరా అమర్చినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. బస్సు ప్రయాణికుల భద్రత, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. బస్సుల్లో జరుగుతున్న దృశ్యాలను డీఎం కార్యాలయంలో అధికారులు ఎల్లవేళలా పరిశీలీస్తుంటారని పేర్కొన్నారు.