HYD: డా.బీ.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో 2019–2024 మధ్య చేరిన డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు ఇంకా ట్యూషన్ ఫీజు చెల్లించని వారు NOV 13 లోపు చెల్లించవచ్చని విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా. వై.వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే 2022–2024 మధ్య ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ అడ్మిషన్ పొందిన వారు కూడా ద్వితీయ సంవత్సరం ట్యూషన్ ఫీజు చెల్లించాలన్నారు.