SRPT: గరిడేపల్లి మండలంలోని కీతవారిగూడెంకి చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు కీత వెంకటేశ్వర్లు బుధవారం రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. వ్యక్తిగత పనులపై ఢిల్లీ వెళ్తుండగా మార్గమధ్యలో జార్కండ్ రాష్ట్రంలోని కడారు ప్రాంతంలో ప్రమాదవశాత్తు రైలు నుంచి పడిపోయాడు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఈ ప్రాంతం నుంచి చురుకైన పాత్ర పోషించాడు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.