KMM: భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో శుక్రవారం నిత్యకళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. వేద ఘోషాలు, మంగళవాయిద్యాల నాదాలు మధ్య స్వామివారిని పుష్పమాలతో, దివ్యాభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆర్చకులు సంప్రదాయ పద్దతిలో నిత్యకళ్యాణాన్ని నిర్వహించగా, ఆలయ ప్రాంగణం భక్తజనులతో కిక్కిరిసిపోయింది.