JN: పాలకుర్తి మండలం విస్నూరు గ్రామంలో రహదారిపై ఆరబోసిన మొక్కజొన్నల కారణంగా బుధవారం రాత్రి ప్రమాదం జరిగింది. విస్నూరు గ్రామానికి చెందిన రమేష్ రావు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ధాన్యంపై జారి పడిపోవడంతో తలకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్లపై పంటలు ఆరబోయడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.