BDK: కరెంట్ షాక్ కారణంగా రైతులు మరణిస్తే వారి కుటుంబాలకు అందించే ఎక్స్గ్రేషియా మొత్తాన్ని రూ. 5 లక్షల నుంచి రూ. 8 లక్షలకు పెంచుతూ తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎక్స్గ్రేషియా అందించాలని ఆయా డిస్కంలను ఆదేశించింది. ఘటన జరిగిన 2 నెలల్లోపే మొత్తాన్ని బాధిత కుటుంబాలకు అందించాలని చెప్పింది.