HYD: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో కలిసి ఢిల్లీలో ఘనంగా నివాళులర్పించారు. కాళోజీ సాహిత్యం, తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా నిలిచిందని, ఆయన ఆలోచనలు సమాజ మార్పుకు దారితీసాయని సీఎం పేర్కొన్నారు. ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలుస్తారన్నారు.