HYD: ఓయూలో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలకు ఇక మీదట అనుమతి లేదని తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇది నియంతృత్వ పోకడ అంటూ ABVP మండిపడుతోంది. అధికారుల తీరుకు వ్యతిరేకంగా నేడు ఉస్మానియా యూనివర్సిటీ బంద్కు నాయకులు పిలుపునిచ్చారు. రిక్రూట్మెంట్, నిధుల కొరత, ఆహార నాణ్యత అంశాలపై విద్యార్థులు ప్రశ్నిస్తున్నారనే నేపంతో ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు.