KMR: గణిత శాస్త్రంలో విద్యార్థులు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకు రావాలని రాష్ట్ర గణిత శాస్త్ర ఫోరం గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. ఇటీవల రాష్ట్రస్థాయిలో జరిగిన పోటీలలో గణితం టాలెంట్ టెస్ట్‌లో ప్రతిభా కనపరిచిన జిల్లాకు చెందిన విద్యార్థులను ఆయన అభినందించారు. ప్రతి విద్యార్థి గణితశాస్త్రంపై పట్టు సాధించాలన్నారు.