NRPT: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను వేగిరం చేసి జిల్లాలో వందశాతం పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదివారం మరికల్, అప్పంపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను కలెక్టర్ పరిశీలించారు. మండలంలో 61 శాతం సర్వే పూర్తైందని ఎంపీడీవో కొండన్న కలెక్టర్కు వివరించారు. సర్వే వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.