ADB: బోథ్ మండలంలోని కౌట గ్రామంలో పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ గ్రామస్థులతో కలిసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాల్లో దేవాలయాలు ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రాలుగా నిలుస్తాయని, గ్రామ ఐక్యతకు ఇవి ప్రతీకలని అన్నారు.