MNCL: కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన కొత్తూరి ప్రణయ్ ట్రిపుల్ జంప్‌లో కాంస్య పతకం సాధించాడు. డిసెంబర్ 7,8,9,19,11 తేదీల్లో భువనేశ్వర్‌లో జరిగిన 39వ జూనియర్ జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2024 పోటీల్లో ట్రిపుల్ జంప్(15.6Mtrs)లో అత్యంత ప్రతిభ కనబరిచి తెలంగాణ రాష్ట్రానికి కాంస్య పతకం సాధించాడు.