KDP: చంద్రబాబు మహిళలను గతంలో అవమానించి, ఇప్పుడు వారి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. రాజకీయ అజెండాతో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనిని అరెస్టు చేశారని, డిబేట్ నిర్వహించినందుకే ఆయనను బాధ్యుడిని చేస్తున్నారని ఆరోపించారు. బాబు ప్రభుత్వం సాక్షి ఆఫీసులపై దాడులు చేయిస్తోందని, చంద్రబాబు, లోకేశ్, బాలయ్య వీడియోలను ట్వీట్ చేశారు.