KMM: ఖమ్మం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్-1 పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను ఈనెల 12న బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నామని ఎక్సైజ్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. గంజాయి, డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన 6 ద్విచక్రవాహనాలను ఉదయం 11 గంటలకు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో వేలంపాట నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఆసక్తి గలవారు బహిరంగ వేలం పాటలో పాల్గొనాలని పేర్కొన్నారు.