GDWL: గద్వాల్ జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశాల మేరకు గట్టు మండల కేంద్రంలో మంగళవారం ఎన్రోల్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి వి. నల్లారెడ్డి అధ్యక్షతన, ఎంపీడీవో చెన్నయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో విద్యార్థుల బడిలో చేరే విషయమై అనేక సూచనలు చేశారు. 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు 6వ తరగతికి ప్రవేశం పొందాలన్నారు.