VKB: కొడంగల్ పట్టణంలోని ఫర్టిలైజర్, పెస్టిసైడ్ షాపులలో అగ్రికల్చర్, పోలీస్ అధికారులు మంగళవారం తనిఖీలు చేశారు. నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలని ADA శంకర్ రాథోడ్, SI సత్యనారాయణ దుకాణదారులకు సూచించారు. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతులకు బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. నాసిరకం విత్తనాలు, మందులు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.