BDK: పినపాక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించనున్నారని ఎంపీడీవో సునీల్ కుమార్ తెలియజేశారు. ఆయన మంగళవారం పినపాక ఎంపీడీవో కార్యాలయంలో మాట్లాడుతూ.. 12వ తేదీ ఉదయం మోడల్ హౌస్ ప్రారంభంతో పాటు సీతంపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళకు ఎమ్మెల్యే పాయం శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు.