BDK: కొత్తగూడెం కార్పొరేషన్ వార్డుల విభజన ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని,అభ్యంతరాలు తెలపడానికి అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని CPM టౌన్ కార్యదర్శి లిక్కి బాలరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మున్సిపల్ మేనేజర్ ప్రసాద్ కి వినతి పత్రాన్ని అందించారు. వార్డుల విభజన గందరగోళంగా ఉందని శాస్త్రీయంగా వార్డుల విభజన చేపట్టాలని కోరారు.