HYD: మహానగరంలో ఎప్పటి లాగే నీటి ఎద్దడి మొదలైంది. దీంతో వాటర్ ట్యాంకర్లు రంగంలోకి దిగాయి. ముఖ్యంగా అపార్ట్మెంట్లు, హాస్టల్లోని బోర్లు అడుగంటి నీటి కొరత ఏర్పడుతోంది. దీంతో నీటిని కొనుగోలు చేస్తున్నారు. నిర్వాహకులు ఒక్కో ట్యాంకర్‌కు రూ.800 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. రాబోయే 3 నెలలు నీటి ఎద్దడి మరింత తీవ్రం కానుంది.