JN: డా.బి.ఆర్ అంబేద్కర్ అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేశారని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఇవాళ ఆయన జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ చూపిన మార్గంలో నడిచి సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.