BDK: భద్రగిరి మార్టులో లభించే ప్రతి నిత్యవసర సరుకుల ధరలు, ఆ వస్తువుల గుణగణాలు పూర్తిస్థాయిలో వినియోగదారులకు తెలిసేలా ప్రదర్శించడం మంచిదని ఎమ్మెల్యే తెల్లం అన్నారు. భద్రాచలంలో నూతనంగా డిజైన్ చేసి నిర్మాణం పూర్తయి శ్రీరామనవమికి ప్రారంభించబోయే భద్రగిరి మార్ట్‌ను నిన్న రాత్రి ఐటీడీఏ పీవో రాహుల్‌తో కలిసి ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పరిశీలించారు.