HYD: సికింద్రాబాద్లో నేడు నిర్వహించనున్న ‘రోజ్ గార్ మేళా’ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొననుండగా, ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రసంగించనున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగాలు సాధించిన యువతకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9:30 గంటలకు సికింద్రాబాద్ బోయిగూడలోని రైల్ కళారంగ్లో జరగనుంది.