BHNG: ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలని బీబీనగర్ సీఐ ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో సోమవారం రాత్రి పోలీస్ సిబ్బందితో కవాత్ నిర్వహించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.