ADB: నార్నూర్ మండలం దుప్పాపూర్ గ్రామానికి వెళ్లే రహదారి గత ఐదేళ్ల నుంచి గుంతలమయంగా దర్శనమిస్తోంది. నీతి ఆయోగ్ పథకం కింద మండలాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నార్నూర్ను ఎంపిక చేసినప్పటికీ అభివృద్ధి మాత్రం జరగడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డును నిర్మించినప్పటి నుంచి నిర్వహణ లేక గుంతలు ఏర్పడుతున్నాయని, రోడ్డుకు మరమ్మతులు చేయాలని ప్రజలు కొరారు.