BHPL: జంగేడు గ్రామంలోని బాలికల గురుకుల పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణం, మౌలిక వసతుల కల్పన కోసం రూ. 38 లక్షల వ్యయంతో బుధవారం MLA గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ శంకుస్థాపన చేశారు. MLA మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వేసవి సెలవుల్లో పనులు నాణ్యతతో పూర్తి చేయాలన్నారు.