HNK: ఐనవోలు జాతరకు వచ్చేటువంటి భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని హనుమకొండ డీఎంహెచ్వో డాక్టర్ ఏ.అప్పయ్య వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. సోమవారం జాతరలో ఏర్పాటు చేసి వైద్య శిబిరమును సందర్శించి అక్కడ అందిస్తున్నటువంటి సేవలను ఆయన పరిశీలించారు. ఈ శిబిరంలో ప్రాథమిక వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు.