KMM: జిల్లా తిరుమలాయపాలెంలో రూ. 26 కోట్లతో నిర్మించనున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనానికి రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. గతంలో కేవలం 30 పడకలతో ఉన్న ఆసుపత్రిని, గిరిజన సోదరులు అత్యవసర చికిత్స కోసం పడే ఇబ్బందులను గమనించి అధునాతన వసతులతో అప్గ్రేడ్ చేస్తున్నామని ఆయన తెలిపారు.