NZB: రైతులకు ప్రభుత్వం అందజేస్తున్న రైతు భరోసా, ఫార్మర్స్ రిజిస్ట్రీ, ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌లలో ఒకే మొబైల్ నంబర్‌ను నమోదు చేసుకోవాలని వర్ని మండల వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్ తెలిపారు. ప్రభుత్వ పథకాలు, ఎరువుల కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఈ మూడు విభాగాలలో వేర్వేరు ఫోన్ నంబర్లు ఉన్నట్లయితే భవిష్యత్తులో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు.