AP: మహిళలకు ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన మొదటి పార్టీ టీడీపీ అని ఎంపీ శబరి అన్నారు. ‘మహిళలకు ఆస్తిలో వాటా కల్పించిన పార్టీ టీడీపీ. తిరుపతిలో మహిళా విశ్వవిద్యాలయాన్ని ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. మహిళలకు న్యాయం చేకూర్చేందుకు కోర్టులు ఏర్పాటు చేశాం. దేశంలోనే డ్వాక్రా కార్యక్రమం విజయవంతమైన ఏకైక రాష్ట్రం ఏపీ. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించాం’ అని వెల్లడించారు.