NLG: చిట్యాల మండలం ఏపూరు ప్రాథమిక పాఠశాలలో స్వర్గీయ గుమ్మి బక్కారెడ్డి జంగమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు సేవా కార్యక్రమం నిర్వహించారు. 2025-26 విద్యా సం.రంలో 5వ తరగతి పూర్తి చేసి ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థి వలిగొండ హర్షవర్ధన్‌కు బుధవారం దాతలు గుమ్మి నర్సిరెడ్డి, రంగారెడ్డిలు సర్పంచ్ మహేష్, హెచ్ఎం అంజయ్యతో కలిసి సైకిల్‌ను బహూకరించారు.