MLG: రేపు మేడారానికి రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రానున్నారు. ఉదయం 11:45 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12:30 గంటలకు మేడారం చేరుకోనున్నారు. మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు హైద్రాబాద్‌కు చేరుకుంటారు.