WGL: జిల్లాలో టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని గురువారం సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి 7,840 పొలం బాట, 938 ప్రజాబాట కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. ఆన్లైన్ బిల్లుల చెల్లింపుతో పాటు 79016 28348 వాట్సాప్ చాట్ సేవను అందుబాటులోకి తెచ్చారు.