NGKL: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ శాఖ ఆర్టిజన్ కార్మికుల సమ్మె సోమవారం నాటికి ఆరో రోజుకు చేరుకుంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 2500 మంది ఆర్టిజన్లు, పీస్ రేట్, స్పాట్ బిల్లర్, అన్మ్యాన్ కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. అదనపు పనిభారం వల్ల ఇబ్బందులు పడుతున్నామని రెగ్యులర్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.